సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎమ్మెల్యే ల కోటాలో ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యేందుకు జనసేన అభ్యర్థిగా పవన్ సోదరుడు నాగబాబు నామినేషన్ దాఖలుకి అవసరమైన పత్రాలు సిద్ధం చేస్తున్నారు.నేడు, గురువారం నాగబాబు గారి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది శాసనసభ్యులు సంతకాలు చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు , ఇతర ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్, లోకం నాగ మాధవి, ఆరణి శ్రీనివాసులు, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, పత్సమట్ల ధర్మరాజు, అరవ శ్రీధర్ , బత్తుల బలరామకృష్ణ, పంతం నానాజీ సంతకాలు చేశారు
