సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవిపై నేడు,. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో పవన్ మాట్లాడుతూ.. ‘‘మనతో ప్రయాణం చేసి, పని చేసిన వారిని నేను గుర్తించాలి నాగబాబు నాతో పాటు సమానంగా పని చేశారు. వైసీపీ నేతలతో ఎన్నో తిట్లు తిన్నారు, ఎంపీగా ప్రకటించి, మళ్లీ నాగబాబును తప్పించాం. అయన త్యాగాలకు ప్రతిఫలంగా ఇప్పుడు త్వరలో నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపిక అవుతారు. మంత్రి అనేది తరువాత చర్చ చేస్తాం. నాగబాబు త్యాగం గుర్తించి రాజ్యసభ సిటు అనుకున్నాం. అక్కడ కుదరలేదు కాబట్టి.. ఎమ్మెల్సీ అనుకున్నాం. కందుల దుర్గేష్ ఏ కులమో నాకు తెలియదు. అతని పని తీరు నచ్చి మంత్రి పదవి ఇచ్చాను. రాజకీయాల్లో కులం కాదు.. పని తీరే ప్రామాణికం’’ అని అన్నారు. మాజీ సీఎం .జగన్ వలన తనకు కొన్ని తెలుస్తాయన్నారు. అధికారంలో లేకుండా ప్రభుత్వ అధికారుల్ని ఎలా బేధిరించాలి అనేది ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రజలు ఎందుకు 11 సీట్లు ఇచ్చారో ఆయనకు, ఆయన పార్టీ నేతలకు ఇంకా వాస్తవం తెలియడం లేదని అదే పొగరుతో తిరుగుతున్నారని డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు చేశారు.
