సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం మీదుగా నాగర్ సోల్ ట్రైన్ లో మహారాష్ట్ర లోని పవిత్ర ‘షిర్డీ’ కి వెళ్లే సాయి భక్తులకు ముఖ్య గమనిక… రైల్వే అధికారులు తెలియజేసిన సమాచారం మేరకు నేటి మంగళవారం జూన్ 21 నుండి 27 వ తేదీల వరకు నాగర్ సోల్ స్టేషన్ వరకు ప్రయాణం ఉండదు. ఔరంగాబాద్ రైల్వే జంక్షన్ వరకు మాత్రమే రైళ్లు ప్రయాణం ఉంటుంది, అలాగే షిర్డీ నుండి తిరుగు ప్రయాణం చేసే భక్తులు కూడా ఔరంగాబాద్ నుండి లేదా మన్మాడ్ లేదా జాల్వా చేరుకొని అక్కడినుండి మన నరసాపురం, లేదా హైదరాబాద్ వైపు వచ్చే ట్రయిన్స్ ఫై ప్రయాణించవలసి ఉంది. 28వ తేదీ నుండి యధావిధిగా నాగర్ సోల్ నుండి నరసాపురం వరకు యధావిధిగా ప్రయాణాలు ఉంటాయి,
