సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీనియర్ హీరో అక్కినేని నాగార్జున గరుడావెగా.. పేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల కాంబినేషన్లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’ సినిమా 3వరాల క్రితం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మంచి టెక్నీకల్ వ్యాల్యూస్ తో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ పార్ట్ వరకు హాలీవుడ్ రేంజ్‌ని తలపించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో టెలికాస్ట్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. తాజ సమాచారం ప్రకారం ఈ చిత్రం నవంబర్ 2వ తేదీ నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా ? తెలుస్తోంది. మాములుగా అయితే పెద్ద సినిమాలు 8 వారాల తర్వాత మాత్రమే ఓటీటీలో రిలీజ్ కావాలని ఇటీవల ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు కొన్ని రూల్స్ తీసుకువచ్చారు. కానీ ఆ రూల్స్‌ని బ్రేక్ చేస్తూ.. నాగార్జున ‘ది ఘోస్ట్’ చిత్రం 4 వారాలకే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. అని తెలుస్తుంది.
