సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో దసరావేడుకలు వివిధ దేవి ఆలయాలలో ఘనంగా జరిగాయి. మరి వేడుకలు ముగింపుగా అన్నసమారాధన ప్రసాద వితరణలు మాత్రం లు రోజు విడిచి రోజు పలు దేవాలయాల వద్ద ఏర్పాటు చేసుకొని నేటి ఆదివారంతో దాదాపు న్నీ చోట్ల నిర్వాహకులు దసరా కార్యక్రమాలు ముగింపు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో గునుపూడి నాచు వారి సెంటర్ లో దసరా వేడుకలు ముగింపుగా శ్రీశ్రీశ్రీ కనక దుర్గమ్మ అమ్మవారి గుడి వద్ద నేటి ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమాన్ని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు భక్తులకు వడ్డన తో ప్రారంభించారు. తదుపరి అయన కూడా ప్రసాదాన్ని స్వీకరించి ఉత్సవ నిర్వాహకులను అభినందించారు.
