సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ జనసేన అభ్యర్థుల మొదటి లిస్ట్ ప్రకటించాక.. పలు ప్రాంతాలలో వారి వారి క్యాడర్ లో ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు.. గత రాత్రి తాడేపల్లి గూడెంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫై జనసేన పార్టీ లోని కొందరు తణుకు క్యాడర్ తీవ్ర దూకుడు ప్రదర్శించారు. ఆయన బస చేసిన అలంపురం లోని జయా గార్డెన్స్ వద్ద తీవ్ర నిరసనకు దిగటంతో పాటు ఆయన ఉన్న రూమ్ లోకి దూసుకొని పోవడానికి ప్రయత్నించడంతో .. నాదెండ్ల మనోహర్ ఫై దాడి చేసే సూచనలు ఉండటంతో స్థానిక పోలీసులు వారిని అడ్డుకొన్నారు. జనసేన నేతలు కోటికలపూడి చినబాబు , దుర్గేష్, బొలిశెట్టి శ్రీనివాస్ లు వారిని సమన్వయ పరిచే ప్రయత్నం చేసిన వారు దూకుడు తగ్గించలేదు. తణుకు టికెట్ ఆశించిన జనసేన ఇన్ఛార్జి విడివాడ రామచంద్రరావు, తన అనుచరులుతో నిరసనకు దిగారు. తనకు టికెట్ ఇవ్వకపోతే ప్రాణాలు తీసుకొంటాను తప్ప తనకు టీడీపీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణకు సహకరించనని అనడంతో జనసేన శ్రేణులు నాదెండ్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నాదెండ్ల జనసేన ను నాశనం చెయ్యడానికి వచ్చాడని టీడీపీ కి పార్టీని .. తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారు. దీంతో తాడేపల్లిగూడెం డీఎస్పీ భారీగా పోలీసులతో అక్కడ మోహరించగా.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత రాత్రి అన్ని మీడియా ఛానెల్స్ లో సోషల్ మీడియాలో ఈ ఘటనలు వైరల్ అయ్యాయి.
