సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ డిసెంబర్ నెల మొదటివారంలో వచ్చిన హాయ్ నాన్న’ సినిమా హీరో నాని కి మంచి చిత్రంగా నిలచిందే తప్ప కమర్షియల్ గా నిలబడలేక పోయింది.’సలార్’, ‘యానిమల్’ సినిమాల భారీ మాస్ విజయాల మధ్య ఈ సినిమా నలిగిపోయింది. . ఇప్ప టికీ థియేటర్లలో అలరిస్తున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఇప్పు డు ఫిక్స్ చేసుకుంది. అనుకున్న టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయిపోయింది. హాయ్ నాన్న ‘ అనే తండ్రి-కూతురు సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా నెట్ ఫ్లెక్స్ లో మరో 5రోజులు అంటే జనవరి 4 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. తొలుత ఈ చిత్రాన్ని సంక్రాంతి తర్వాత ఓటిటి లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పటికే కలెక్షన్స్ డౌన్ అవ్వడంతో ఇక మంచి ఆఫర్ కు ఓటిటి లో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.
