సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని నేడు, శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బియ్యం మిస్సింగ్ స్కామ్‌లో ఇరుక్కు్న్న పేర్ని నాని కుటుంబం.. తాను తన కుటుంబం పరారీలో ఉన్నట్లు, టీడీపీ సోషల్ మీడియా సెల్ తమపై తప్పుడు రాతలు రాస్తోందని తాను బందరులోనే ఉన్నానని తన కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టి ఇరికించాలని చూస్తున్న నేపథ్యంలో తన లాయర్లు సూచన మేరకు మీడియా ముందుకు రాలేదని అన్నారు. .. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. తమ గోడౌన్‌ అద్దెకు ఇచ్చామని అయిన అక్కడ బియ్యం తగ్గిందని అధికారులు చెప్పారని.. దాని నష్టపరిహారం చెల్లిస్తామని తెలుపుతూ గతంలోనే నైతిక బాధ్యత వహిస్తూ తన సతీమణి అధికారులకు కలెక్టర్ కు ఒక లేఖ రాశారని గుర్తు చేశారు. కారణాలు ఏవైనా అధికారులు తనిఖీలు చేసి 3,800 బస్తాలు తగ్గాయన్నారు. దానికి పరిహారంగా అంతే విలువైన నగదు చెల్లించామని అయినాసరే తమపై కక్ష కట్టి తన భార్య, గోడౌన్‌ ఇన్‌చార్జి మీద కేసు నమోదు చేశారన్నారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్తే రకరకాల కుట్రలు చేశారని, పదే పదే పీపీలను మార్చుతూ అడ్డంకులు సృష్టించారన్నారు. తనను, తన కుమారుడిని అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని నాని ఆరోపించారు. గోడౌన్ మేనేజర్‌ని అరెస్ట్ చేసి.. ఆయన ద్వారా తన పేరు చేర్చడానికి ప్లాన్ చేశారన్నారు. గోడౌన్‌ తలుపులు పగులగొట్టి సరుకును తీసుకెళ్లారన్నారు. అందులోని సరుకు బాధ్యత మాది, సివిల్ సప్లై అధికారులది. కానీ, తమ ప్రమేయం లేకుండా సరుకును తరలించుకుపోయారు. పైగా నెపం నా కుటుంబం మీద వేస్తున్నారని ,. తాము 3 సార్లు ఎమ్మెల్యే అయిన ఎప్పడు ఏ తప్పుడు పని చేయలేదని మాజీ మంత్రి స్పష్టం చేశారు. 3 శాతం లంచాలు తీసుకుని బిల్లులు తీసుకునేవారు కూడా తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ విపక్ష నేతలపై మాజీ మంత్రి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 30న బెయిల్ తీర్పు ఉన్నందున అన్ని విషయాల గురించి మాట్లాడటం లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *