సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ కేబినెట్ సమావేశం నేడు, గురువారం సుదీర్ఘంగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఇకపై 34 శాతం రిజర్వేషన్‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.అని తాజా వార్త సమాచారం.. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో బీసీలకు కీలక పదవులు దక్కే అవకాశం ఉంది. మొత్తం 21 అంశాలు ఏజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. అలాగే దేశీయ తయారీ విదేశీ మద్యం, బీర్లు, ఎఫ్‌ఎల్- స్పిరిట్‌పై విధిస్తున్న అదనపు రిటైల్ ఎక్సైజ్ టాక్స్ రివిజన్‌పై కేబినెట్‌లో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది ఇంకా కాబినెట్ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తీ సమాచారం అందవలసి ఉంది.
