సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చి మ గోదావరి జిల్లాలోని భీమవరం, ఉండి, గణపవరం, ద్వారకా తిరుమల జంగారెడ్డిగూడెం నుండి రోజు వేలాది వాహనాలు ఇరువైపులా రాకపోకలు సాగించడానికి వీలుగా ఉండి కూడా ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకొన్న కీలకమైన ఉం గుటూరు మండలం ” నారాయణ పురం వంతెన” స్థానంలో ఏలూరు ప్రధాన కాలువపై నూతనంగా మరో వంతెన నిర్మా ణానికి రూ.8.50 కోట్లు మంజూరయ్యాయి. దీనితో స్థానిక ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. 216ఏ జాతీయ రహదారి, ఆర్& బి రహదారిని కలుపుతూ నిర్మించిన ఈ వారధి ఆక్వా ఎగుమతులకు కీలకంగా మారింది. పశ్చిమ గోదావరి వారికే కాదు తూర్పు గోదావరి జిల్లాలోని దూబచర్ల వైపు రాకపోకలు సాగిం చడానికి అనువుగా ఉన్న ఈ వంతెన స్థానికులు సుదీర్ఘ కాలంగా చేస్తున్న విజ్ఞప్తుల దృష్ట్యా త్వరలో కొత్త వంతెనతో మోక్షాము కలగనుంది. వం తెన నిర్మా ణానికి నిధులు మం జూరైన నేపథ్యం లో , ఆర్& బి అధికారులు గత శనివారం, నేడు, ఆదివారం సర్వే చేపట్టారు. ఈ వేసవిలో పనులు ప్రారంభిస్తారు. నిర్మాణ సమయంలో ద్విచక్ర వాహనాలకు , ఆటోలకు తాత్కాలిక వంతెన ఏర్పా టు చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *