సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబు ను రాజమండ్రి సెంట్రల్ జైలులో పెట్టినపుడు మనోవేదన తో మరణించిన టీడీపీ మద్దతు దారుల కుటుంబాలను పరామర్శించడానికి గతంలో చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ కార్యక్రమం ప్రారంభించిన సంగతి విదితమే.. అయితే అప్పట్లో నిలిపివేసిన ఈ కార్యక్రమాన్ని తిరిగి తాజగా విశాఖలో ఆమె ప్రారంభించారు. బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారు. విశాఖ జిల్లాలో ఏడుగురు టీడీపీ కార్యకర్తలు చనిపోయారు అని భావిస్తూ. . వారి కుటుంబాలను భువనేశ్వరి నేడు, శుక్రవారం పరామర్శించారు. దక్షిణ నియోజకవర్గంలో ఇద్దరు, ఉత్తర నియోజకవర్గంలో ఇద్దరు, గాజువాకలో ముగ్గురు కార్యకర్తలు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వెంకటేశ్వర్ మెట్ల వద్ద ఒక బాధిత కుటుంబాన్ని, విశాఖ సౌత్ నియోజకవర్గం, విశాఖ 33వ వార్డులో, జాగరపు చిన్ని కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. బాధిత కుటుంబాల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *