సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కూటమి అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియా ద్వారా కొందరు విదేశాలలో అభాగ్యుల. పేద విద్యార్థుల సమస్యల విజ్ఞప్తులపై పరిష్కారం కోసం ఏపీ విద్య శాఖ మంత్రి నారా లోకేష్ చాల వేగంగా స్వాందిస్తున్నారు. ఇప్పటికే లోకేష్ చొరవతో విదేశాల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న దాదాపు 25 మంది తిరిగి స్వగ్రామాలకు చేరారు. పలువురు పేద విద్యార్థులకు ప్రభుత్వ పథకాలతో సంబంధం లేకుండా ఆర్ధిక సహకారం అందింది. తాజగా.. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రాజీవ్ నగర్‌కు చెందిన యల్లంపల్లి లక్ష్మి అనే మహిళ ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లారు. కువైట్‌కు వెళ్లిన ఆమెను మోసం చేసిన ఏజెంట్ ఓ ఇంట్లో పనికి కుదిర్చాడు. అక్కడ ఆమెను యజమాని నిత్యం వేధింపులకు గురి చేస్తూ గదిలో పెట్టి కొట్టేవారు. అయితే తాను పడుతున్న చిత్రహింసలను సదరు మహిళ కుటుంబానికి తెలియజేసింది.స్థానిక టీడీపీ నేత ఎక్స్ (ట్విటర్) ద్వారా లక్ష్మి గురించి మంత్రి లోకేశ్ తెలియజేశారు. దీనికి స్పందించిన మంత్రి లోకేశ్ బాధితురాలు లక్ష్మిని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. మంత్రి లోకేశ్ తన టీమ్‌ని రంగంలోకి దింపారు. .ఆ దేశ ఎంబసీతో మాట్లాడి లక్ష్మీని స్వస్థలానికి చేర్చేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు బాధితురాలు నేడు, శనివారం భారత్‌కు తిరిగి వచ్చారు. దీంతో లక్ష్మి కుటుంబం మెుత్తం మంత్రి నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *