సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ అగ్రనేత, ఎమ్మెల్సీ, బొత్స సత్యనారాయణ నేడు, శనివారం మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అంతమొందించేందుకు కొందరు కుట్ర పన్నారని ఆరోపించారు. తనకు తన కుటుంబ సబ్యులకు వైసీపీ నేతలకు కేటాయించిన పైడితల్లి సిరిమానోత్సవంలో వేదిక కూలిపోవడంపై కలెక్టర్, ఎస్పీల బాధ్యతను ప్రశ్నించారు. ఈ విషయంపై గవర్నర్, సీఎస్‌లకు లేఖ లో దీనిపై దర్యాప్తు జరగాలని పిర్యాదు చేస్తానని తెలిపారు. అక్కడ ప్రభుత్వ అధికారులు ద్వంద్వ వైఖరి ప్రదర్శించారని, ఆర్భాటం, అహంకారం తప్ప మా ఉత్తాంధ్ర ప్రజల సాంప్రదాయాలకు తావివ్వలేదని విమర్శించారు. తాను 15 ఏళ్లు మంత్రిగా, 5 ఏళ్లు ఎంపీగా ఉన్నప్పుడు ఉత్సవాల్లో పాల్గొన్నానని..అయితే, స్థానిక పెద్దలకు రాజకీయాలకు అతీతంగా గౌరవం ఇచ్చామని కానీ ఈ ఏడాది అధికారులు సరైన ప్రమాణాలు పాటించలేదని, కొంతమంది ప్రాపకం కోసం విడ్డూరంగా ప్రవర్తించారని ఆయన విమర్శించారు. ఇది తాను వ్యక్తిగతంగా చెప్పడం లేదని, విజయనగరం పట్టణంలో ఏ తలుపుతట్టి ప్రజల అభిప్రాయం తీసుకున్నా ఇదేమాట అంటారని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేసారు.
