సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చాలాకాలంగా ఆన్ లైన్ ‘బెట్టింగ్ యాప్’ ల మాయలో పడి లక్షలాది రూపాయలు పోగొట్టుకొని అయిన వాళ్లకు మొఖం చూపించలేక ఆత్మహత్యలు చేసుకొంటున్న అభాగ్యులు ఎందరో.. అయితే.. కాస్త వెటకారం.. మరి కాస్త నోటి దూల.. కలగలసి నవ్వులు పూయించే..ప్రపంచ యాత్రికుడుగా ప్రసిద్ధి పొందిన తెలుగు యూ ట్యూబర్ నా ‘అన్వేషణ’ ఈ యాప్ ల నిర్వాహకులపై ఆరోపణలు చేస్తూ ప్రముఖ సెలబ్రెటీలు ను వదలకుండా వీడియోలు వదులుతున్న నేపథ్యంలో.. బెట్టింగ్ యాప్‌లను హైదరాబాద్ మెట్రోరైలులో ప్రమోట్ చేస్తున్నారని తెలంగాణ హైకోర్టు దృష్టికి పలువురు తీసుకెళ్లారు. అయితే మెట్రోలో బెట్టింగ్ యాప్స్ ప్రచారం వెనుక కొంతమంది ప్రభుత్వ పెద్దలు ఉన్నారంటూ వారి పేర్లతో నా అన్వేష్ (na Anvesh వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. దానితో తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ అన్వేష్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటాగా కేసు నమోదు చేశారు. ఈ వీడియోలులో.. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎఎస్ రెడ్డి, మాజీ సీఎస్ శాంతి కుమారి, ఐఏఎస్‌లు దాన కిషోర్, వికాస్ రాజ్‌లపై అన్వేష్ ఆరోపణలు చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల ద్వారా రూ.300 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని అన్వేష్ వీడియోలో పేర్కొన్నారు. ఆవాస్తవంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అన్వేష్‌పై ఓ కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు అన్వేష్‌పై సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేశారు.
