సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అచ్చ తెలుగులో కామిడి టైమింగ్ తో ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు సాహసోపేతంగా చూపించే ప్రపంచ యాత్రికుడిగా పేరు తెచ్చుకున్న యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)కు తాజగా మరో బిగ్‌షాక్ తగిలింది. పంజాగుట్ట పోలీసులు అతనిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు.దీనితో అతడు ప్రపంచంలో ఎక్కడ ఉన్న హైదరాబాద్ పంజాగుట్ట పోలిసుల ముందు విచారణకు రావలసి ఉంది. ఇటీవల అన్వేష్ అకౌంట్‌ను ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత అతడు తనకు ఇంకా రెండు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు, రెండు యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయని వీడియో విడుదల చేశారు.చాల పేదరికం నుండి దేశంలోనే నెంబర్ వన్ ట్రావెలర్ యూట్యూబర్ ఎదిగిన అన్వేష్ ‘అహం’ నెత్తికెక్కి ప్రేక్షకులు వినలేని అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ, వీడియోలను విడుదల చేయడం. మన దేశ విధానాలను తక్కువ చేసి నాయకులను, బూతులతో సంబోధించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. బెట్టింగ్ యాప్ లపై నిషేధం విధించాలని ఇతడు చేసిన పోరాటం దేశాన్ని ప్రభావితం చేసి దానిని ప్రభుత్వం పార్లమెంట్ లో చట్టం కూడా తీస్కోనివచ్చేంత ప్రభావం చూపింది. అయితే నోటి దూల అన్వేష్ తన పతనం కు తానే గొయ్యి తవ్వుకొన్నట్లు అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *