సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వింజమూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నా జీవితంలో వైసీపీ లాంటి పార్టీని, జగన్ లాంటి వ్యక్తిని చూడలేదు’ అని అన్నారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని మూడు ముక్కాలా ఆటగా మార్చి విధ్వంసం చేసి ఆనందించారని విమర్శించారు. . అమరావతి తీర్మానం రోజున వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాలేదన్నారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ కు అమరావతి ఏకైక ప్రజా రాజధాని అనిఇక ఇంచు కూడా ఎవ్వరూ కదిలించలేరని . అమరావతికి చట్టబద్ధత తీర్మానంపై లోక్‌సభలో చర్చ జరుగుతోందని… ఆమోదం పొందిందని హర్షం వ్యక్తం చేసారు. ‘నాపై కోపంతో పోలవరం ప్రాజెక్ట్‌ను వైసీపీ వాళ్ళు గోదావరిలో కలిపేశారు. మేము గోదావరి పుష్కరాల లోపు పోలవరం పూర్తి చేస్తాం అని అన్నారు. .ఒకటో తేదీ వస్తే రాష్ట్రంలో పేదలే గుర్తొస్తారని.. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా 63 లక్షల మందికి ఫించన్లు పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు పేదల జీవన ప్రమాణాలు పెరగడం లేదని.. అందుకే P4 ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
