సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఎండనక వాననక .. మహబూబ్‌నగర్‌లో పాదయాత్ర చేస్తున్న తెలంగాణ వైఎస్‌ఆర్‌ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నేడు, ఆదివారం మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో నా తండ్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ని కుట్ర చేసి చంపారని, ఇప్పుడు తనను కూడా చంపాలని చూస్తున్నారని అన్నారు. తాను వైఎస్‌ఆర్ బిడ్డ, భయం లేదని, ఈ పాలసీ సీఎం కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలన్నారు. ఓ మహిళను ఎదుర్కోలేక స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు, తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని, ఈ బేడీలకు తాను భయపడనని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. తాను బ్రతికినంతకాలం ప్రజల కోసం పోరాటం చేస్తానన్నారు. తనను ఎదుర్కోలేని దద్దమ్మలు పోలీస్ కేసులు పెడుతున్నారు. గతంలో తనను టీఆరెస్ వాళ్ళు అవమానిస్తే వైఎస్సార్ బిడ్డగా తాను కేసు పెట్టిన పోలీసులు స్పందించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *