సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: నేడు, బుధవారం మంగళగిరిలో పర్యటించిన టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారాలోకేష్ మాట్లాడుతూ.. వైసిపి వాళ్ళు, నా తల్లిని విమర్శించడం బాధించింది. నా తల్లిపై ఆరోపణలు చేసిన వారిని వదిలిపెట్టం. మహిళా అని చూడకుండా ఇంత దారుణమా? టీడీపీ అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామని’’ అని బిగ్గరగా హెచ్చరించారు. ఈ రోజు మంగళగిరిలో పలు వార్డుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిడమర్రు రోడ్డులో డంపింగ్ యార్డును ఆయన పరిశీలించారు. డంపింగ్ యార్డు మారుస్తామని చెప్పి ఎమ్మెల్యే మాట తప్పారని దుయ్యబట్టారు. వరద బాధితులను ఆదుకుంటే ఆరోపణలు చేస్తారా? అని ప్రశ్నించారు. ఇటీవల మరణించిన కార్యకర్తలు, నాయకుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను లోకేష్ పరామర్శిస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారంపై స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నీ విమర్శిస్తూ వారానికోసారి వచ్చి ఫొటోలు దిగి జంప్ అయిపోతున్నారని ఎద్దేవాచేశారు.
