సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈసారి కూడా ‘నా నేల భీమవరంగా భావించా .. ఇక్కడే ఉంటా.. నా భీమవరం నుండే నేను పోరాడతాను.. పవన్ కళ్యాణ్ స్వయంగా నేటి శుక్రవారం రాత్రి డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బహిరంగ సభలో చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాలలో అన్ని న్యూస్ ఛానెల్స్ లోను ప్రతిధ్వనించింది. ఇలా పవన్ భీమవరం బహిరంగ సభలో ప్రకటిస్తారని అందరి కన్నా ముందే మన సిగ్మా న్యూస్ నిన్న ఉదయమే ‘ప్రత్యేక ఐటెం’ వెయ్యడం భారీగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మద్యహ్నం నుండి పలు న్యూస్ ఛానెల్స్ , మీడియా పత్రికలలో న్యూస్ స్క్రోలింగ్ లు వెయ్యడం గమనార్ధం..నిజానికి పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలలో భీమవరం నుండి పోటీ చేస్తారని ఎన్నికలకు 7 నెలలు ముందే మన ‘సిగ్మాతెలుగు’ డాట్. సంచలనంగా ప్రకటించింది. తరువాత అదే వాస్తవం కావడం గమనార్హం.. పవన్ తన ప్రసంగంలో భీమవరం నేను ఓడిపోయానంటే నేనే నమ్మలేక పోతున్నాను. ఆ భావన కూడా నాకు రాదు, నాకు ఇక్కడకు ఎప్పుడు వచ్చిన మీ ప్రాంత ప్రజలు అభిమానులు చూపిస్తున్న అభిమానం నాకు ఓటమి గుర్తుకు రావడం లేదు.. భీమవరం ప్రజలతో మనస్సు విప్పి మాట్లాడుతున్నాను.. నాకు మీకు 25 ఏళ్ళు సేవ చెయ్యాలని ఉంది. ఎన్నికలలో పోటీచేస్తున్నాను. ఈసారి నన్ను శాసన సభకు పంపండి.. అని పవన్ వ్యాఖ్యానించడం గమనార్హం.. ఇక్కడ ప్రభాస్ అభిమానులు ఎక్కువ అని నాకు తెలుసు.. గతంలో వారి సినిమా బాహుబలి ఫ్లెక్సీ చింపిన వివాదం పెద్దది కావడం నాకు చాల బాధేసింది. అన్ని మరచిపోండి. ఇక్కడ మహేష్ బాబు అభిమానులు ఎక్కువే.. ఎన్టీఆర్ ..చరణ్ అభిమానులు ఉన్నారు ఆ హీరోలు అంటే నాకు ఇష్టమే.. నాకు కొందరు అభిమానులు ఉన్నారు.. అందరు నన్ను అంటే మన జనసేన ను ఆదరించడండి అంటూ దూరదృష్టితో ముందరకాళ్లకు బంధం వేశారు పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *