సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 7ఏళ్లలో.. సోగ్గాడే చిన్ని నాయనా తరువాత సరియిన హిట్ లేని అక్కినేని నాగార్జున సీనియర్ హీరోలలో బాగా వెనుకబడ్డారు. అయితే బిగ్ బాస్’ గా అలరిస్తున్నారు. గత సంవత్సరం అక్టోబర్ లో విడుదలైన ‘ది ఘోస్ట్’ నాగార్జున కెరీర్ లో ఒక పెద్ద డిజాస్టర్ సినిమా అని చెప్పొచ్చు. ప్రవీణ్ సత్తారు ఆ సినిమాకి దర్శకుడు. ఆ సినిమా తరువాత నాగార్జున సినిమాలు చెయ్యడం మానేశారు. అయితే తాజగా ఈరోజు అంటే ఆగస్టు 29, నాగార్జున పుట్టినరోజు సందర్భంగా అతని రాబోయే సినిమా గురించి ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమాకి టైటిల్ కూడా ‘నా సామి రంగ’ అని పెట్టి నాగార్జున ఒక మాస్ లుక్ లో వున్న పోస్టర్ విడుదల చేశారు. కొత్త కుర్రాడు విజయ్ బిన్ని దీనికి దర్శకుడు, అలాగే బెజవాడ ప్రసన్న కుమార్ కథ అందించారు. విజయ్ బిన్ని ఇంతకు ముందు కొరియోగ్రాఫర్ గా అందరికి పరిచయం, ఇప్పుడు దర్శకుడిగా మారుతున్నాడు. శ్రీనివాస్ చిట్టూరి దీనికి నిర్మాత. శరవేగంగా షూటింగ్ పూర్తీ చేసి సంక్రాంతి కానుకగా పెద్ద సినిమా ల తో బరిలో దిగాలని నాగార్జున రెట్టించిన ఉత్సహంగా ‘నా సామి రంగ’ అంటూ పక్క మాస్ లుక్ లో బరిలోకి దిగుతున్నారు.
