సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో డెడ్ బాడీ పార్శిల్ కేసులో ఎట్టకేలకు నిందితుడు శ్రీధర్‌ వర్మను అయన 2వ మరియు 3వ భార్యను పోలీసులుఅరెస్ట్ చేసారు. ఈ నేపథ్యంలో ఎస్పీ నయీమ్ హస్మి నేడు, గురువారం ఉదయం భీమవరం లోని గొల్లలకోడేరు రోడ్డులోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నయీమ్ హస్మి మీడియా సమావేశములో మాట్లాడుతూ.. గత 40 ఏళ్ల సర్వీసులో ఇటువంటి క్రైమ్ కేసు చూడలేదని గత 8 రోజులుగా తమ దర్యాప్తులో వెలుగు చుసిన సంచలన విషయాలు మీడియా కు వెల్లడించారు. నిందితుడు శ్రీధర్‌ను విచారణ చేయగా .. తన వదిన ( 2వ భార్య అక్క ) వద్ద ఉన్న పొలం ఆస్తిని రాయించు కోవడానికి ఆమెను బెదిరించడానికి తనవద్ద కూలి పనికి వచ్చిన అమాయకుడు పర్లయ్యను మందు తాగించి 3వ భార్య(ప్రియురాలు) సహకారంతో నైలాన్ తాడుతో అతని మెడ బిగించి హత్య చేసి ఆ తర్వాత శవాన్ని గాంధీనగర్‌లోని ఇంట్లో అప్పటికే సిద్ధం చేసిన చెక్కపెట్టెలో పెట్టారు. మర్నాడు పర్లయ్య శవాన్ని తులసి ఇంటికి పార్శిల్‌గా పంపారు. ఆమెను టెంక్షన్ లో ఆస్థి తమకు రాసేయ్యక పొతే నీకు ఇదే గతి అని, హత్య కేసులో బయటకు రావని బెదిరించారు. అయితే ఆమె లొంగలేదు. అయితే హత్యకు శ్రీధర్ మూడో భార్య, పదేళ్ల కుమార్తె సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు తన వదిన తులసి ఆస్తిని కొట్టేయాలన్న కుట్రలో ఇద్దరు భార్యలతో కలిసి దారుణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడు శ్రీధర్ తల్లిదండ్రులు భీమవరం శివారులోని కోపెళ్లలో చేపల చెరువులపై జీవిస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. గాంధీ నగర్‌లో అతడి మెుదటి భార్య ఎలిజెబెత్ రాణి ఉంటోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. రెండో భార్య రేవతికి పిల్లలు లేరు. ఆమెను మెుగల్తూరులో ఉంచాడు. మూడో భార్యగా చెప్తున్న సుష్మకు పదేళ్ల కుమార్తె ఉంది. సుష్మను కాళ్ల పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ ఇంట్లో ఉంచినట్లు తెలిసింది. ఈ కేసును ఛేదించిన ఆచంట సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ ను ఇతర సిబ్బందిని ఎస్పి నయీమ్ హస్మి అభినందించి, ప్రశంస పత్రాలు జ్ఞాపికలు అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *