సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: గత శనివారం రాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రెయివేటు సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన సీఐ విద్యార్థుల సెమినార్లో స్వయంగా తననే ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు. నిజం చెపుతున్నాను ఇప్పటికైతే ‘తానొక ఫెయిల్యూ ర్ రాజకీయ నాయకుడిని’ అని అని అనడంతో కొందరు అభిమానులు నో నో అంటూ కేకేలు వేశారు. వారిని సముదాయయించి పవన్ మాట్లాడుతూ.. నేను రాజకీయాల్లో విఫలం అయ్యాను. దీన్ని తాను అంగీకరిస్తున్నానని అయితే రాజకీయాల్లోవిఫలమయ్యానని తానేమీ బాధపడడం లేదన్నారు. ఫెయిల్యూర్ తో భయపడేది లేదని మరల విజయం సాధించడానికి కృషి ప్రారంభించానని, తాను కనీసం ప్రయత్నం చేశానని అనుకుంటానన్నా రు. ఫెయిల్యూ ర్ కూడా సగం విజయంతో సమానమని భావిస్తున్నా నని తెలిపారు. సినిమాల్లో హీరోగా నటించాలని తాను ఎప్పు డూ కోరుకోలేదన్నా రు. తన మొదటి సినిమా ఫ్లాప్ అయిందని గుర్తుచేశారు. ఆ అపజయం తర్వాత కూడా తానెప్పు డూ నిరుత్సాహపడలేదన్నారు. తన విజయాల గ్రాఫ్ ఏడో సినిమా తర్వాత మాత్రమే పెరిగిందని తెలిపారు. ఆ తర్వాత కూడా ఆరేడేళ్లపాటు అపజయాలనే చవిచూశానన్నారు. ఆ తర్వాతే ‘గబ్బర్ సింగ్’ సినిమా విజయం దక్కిందని వెల్లడించారు. జీవితంలో అపజయాలు, విజయాలు సర్వ సాధారణమన్నారు. సి ఐ విద్యార్థులు అపజయాలకు భయపడకుండా విజయం కోసం ప్రతి ఒక్క రూ నిరంతరం అందివచ్చి న అవకాశాలను సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు.
