సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు నేడు, సోమవారం ఢిల్లీ లో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో మరోసారి నరసాపురం ఎంపీగా తెలుగుదేశం పార్టీ, జనసేనలతో కలిసే తాను పోటీ చేస్తానని, అందులో ఎటువంటి సందేహం అక్కరలేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తనని లక్ష్యంగా చేసుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అరడజన్ మంది నాయకులు, నాయకురాళ్లు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారన్నారు. సీఎం జగన్ వీరి వెనక ఉండి ఈ విమర్శలు చేయిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి తనని ఎంతలా రెచ్చగొట్టాలని చూసిన తాను రెచ్చిపోయేది లేదని స్పష్టం చేశారు. ఇటీవల తనపై విజయసాయిరెడ్డి తిట్ల పురాణం తగ్గించారన్నారు. మంచి మార్గంలో పయనిస్తున్న విజయ సాయిని అభినందిస్తున్నట్లు తెలిపారు.
