సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ సీఎం జగన్ రాష్ట్ర బడ్జెట్ ఫై చేసిన విమర్శలకు కౌంటర్ గా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రంగా స్వాందించారు మాజీ సీఎం జగన్ ముందు పద్ధతులు నేర్చుకోవాలని, వై నాట్ 175 అని ఎగిరిన మనిషి 11కు పడిపోవడంతో మతి భ్రమించి, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీ లో హాజరు కాకుండాతనకు 40 శాతం ఓట్లు ఉన్నాయని ప్రతిపక్ష హోదా కావాలని జర్మనీ చట్టాలు ఏపీలో అమలు చేస్తానంటే ఎలా? అని ప్రశ్నించారు. జగన్ .తన ప్రజా జీవితంలో ఒక్క రూపాయి అయినా ఎవరికైనా దానం ఇచ్చి దాతగా నిలబడ్డారా ? మా అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నో వేలాదిమందికి తన కష్టార్జితంతో ఆర్ధిక సాయం చేశారని అన్నారు. నిన్నటి పట్టభద్రుల ఎన్నికల్లో తీర్పు ఇచ్చింది యువత కాదా? ఇంకా సూపర్ 6 గురించి మాట్లాడే అర్హత జగన్‌కులేదు.. అధికారంలో ఉన్నప్పుడు నిజాయితీగా ఒక్కరోజైనా జగన్ పనిచేశారా? అని ప్రశ్నించారు.అధికారంలో ఉండగా వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రిగా ముద్రపడిన వ్యక్తి, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ బెంగుళూరు ఎమ్మెల్యేగా మారాడని ఎద్దేవ చేశారు. జగన్ కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అని మేం అనలేక కాదు, మాకు సభ్యత ఉందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.మా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసి తీరుతుందని మంత్రి వ్యాఖ్యానించారు.
