సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరో 4 రోజులలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్నదని సమాచరం ..బహుశా ఎన్నికలకు 40 రోజుల సమయం ఉండొచ్చు.. కూటమిలో ఇప్పటికే టీడీపీ 99 సీట్లలో అభ్యర్థులను ప్రకటించేసింది. కానీ జనసేనకు 24 కేటాయించినప్పటికీ ఆయా స్థానాలలో అభ్యర్థులను మాత్రం కేవలం 5గురిని మాత్రమే ప్రకటించారు. అయితే నేడు, సోమవారం ఉదయం జనసేన కు సుదీర్ఘంగా సేవలు అందించిన కందుల దుర్గేష్ ను నిడదవోలు అసెంబ్లీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. రాజమండ్రి రురల్ అభ్యర్థిగా కందుల దుర్గేష్‌ను మొదట భావించినప్పటికీ అక్కడ టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర అభ్యన్తరం వ్యక్తం చెయ్యడంతో తప్పని పరిస్థితులలో దుర్గేష్ ను నిడదవోలు అభ్యర్థిగా ఒప్పించారు. మరి అక్కడ నికార్సైన టీడీపీ నేత శేషారావు ఎప్పటి నుండో ప్రజల మధ్య ఉంటున్నారు. అక్కడ స్థానిక టీడీపీ నేతల నుండి అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఈ తక్కువ సమయంలో వారిని దుర్గేష్ ఎలా తనకు అనుకూలంగా మార్చుకొంటారో చూడాలి.. దుర్గేష్ ప్రస్తుతం జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *