సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో , రాష్ట్రంలో పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో పెట్టడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని పశ్చిమ గోదావరి జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి జె వి ఎన్ గోపాలన్ ఆధ్వర్యంలో సిపిఎం నేతలు నేడు, మంగళవారం సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఉండి లో ధర్నా నిర్వహించి, ప్రజల నుండి వాహనదారుల నుండి ధరల పెరుగుదలకు నిరసనలో బాగస్వామ్యులుగా సంతకాల సేకరణ ఉద్యమం ను సిపిఎం నేతలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జె వి ఎన్ గోపాలన్ మాట్లాడుతూ.. దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యగులకు మాట ఇచ్చి ఇప్పుడు ఉన్న ఉద్యొగాలు పీకేస్తున్నారని, అన్ని ధరలు పెరిగిపోయాయని లీటర్ పెట్రోల్ 70 రూపాయలు నుండి 112 రూపాయలకు, వంట ఆయిల్ 140 రూపాయలకు,, ఇంటిలో వంట గ్యాస్ బండ 450 రూపాయలు నుండి 1200 రూపాయలువరకు ఇష్టం వచ్చినట్లు 300 శాతం అదనంగా పెంచుకొంటూ ప్రజలను దోపిడీ చేస్తున్నారని, రాష్ట్రంలో విద్యుత్తూ చార్జీలు దారుణంగా పెంచేశారని దీనిపై 100 రోజులలో ప్రభుత్వం ధరలు తగ్గించాలని లేకపోతే ప్రజా ఉద్యమం సిపిఎం ఆధ్వర్యంలో ప్రారంభిస్తామని డిమాండ్ చేసారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *