సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తానికి అంబరాన్ని అంటిన సంక్రాంతి పండుగ సందడి బంధుమిత్రుల తిరుగుప్రయాణాలు ముగిసాయి.మొన్న ఆదివారం మోని అమావాస్య నేపథ్యంలో తిరుగు ప్రయాణాలు తక్కువగానే ఉన్నప్పటికీ నిన్న సోమవారం మాత్రం దాదాపు అందరు అతిధులు వారి స్వస్తలకు తిరుగు ప్రయాణాలకు క్యూ కట్తారు. భీమవరం తో పాటు జిల్లలో ప్రధాన కేంద్రాలలో ప్రయాణికుల రద్దీ కనపడింది. ప్రవేటు వాహనాల యాజమాన్యాలు అదనపు రాబడి బాగా ఆర్జించారు. సోమవారం ఆదివారానికి మించిన రద్దీతో ఉదయం నుంచి బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిట కిటలాడాయి. జనరల్ బోగిలాలలో సైతం ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. హైదరాబాద్ కు ఎక్కువ సర్వీసులు నడిచాయి.. తిరుగు ప్రయాణాలలో గత 3 రోజులుగా జిల్లాలో ఆర్టీసీ స్పెషల్ 45 స్పెషల్ సర్వీస్ బస్సులు నడిపింది. జిల్లాలోని ప్రతి డిపో నుంచి గత సోమవారం నాలుగు స్పెషల్‌ బస్సులు నడిపింది. భీమవరం నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం నుంచి మొత్తం 16 స్పెషల్‌ బస్సులు నడపడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *