సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత బుధవారం భారీ లాభాలను ఆర్జించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు, గురువారం నూతన సంవత్సరం తొలి రోజున లాభనష్టాలతో ప్రమేయం లేకుండా దాదాపు ప్లాట్ గా ముగిసాయి. అయితే కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో టెలికాం సెక్టార్ లాభాలను ఆర్జించింది. అలాగే డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి నష్టపోవడం కూడా సూచీలను వెనక్కి లాగింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్‌గా రోజును ముగించాయి ( stock market).గత సెషన్ ముగింపు (85, 220)తో పోల్చుకుంటే గురువారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ సాయంత్రానికి చివరకు సెన్సెక్స్ 32 పాయింట్ల నష్టంతో 85, 188 వద్ద ముగిసింది. మరో వైపు నిఫ్టీ మాత్రం స్వల్ప లాభాలను ఆర్జించింది. చివరకు 16 పాయింట్ల లాభంతో 26, 146 వద్ద స్థిరపడింది . బ్యాంక్ నిఫ్టీ 129 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 265 పాయింట్లు పెరిగింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 89.96 వద్ద నిలబడింది.
