సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భాగ్యనగరంలో నేడు, శనివారం భక్తులకు వచ్చే వినాయక చవితి కి మరల వస్తామని చెప్పి బై బై చెపుతూ వేలాది గణేష్ నిమజ్జనాలు 20వేల మంది పోలీస్ భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా నిమజ్జనానికి వెళ్లే ముందు ప్రఖ్యాత మహిమానిత బాలాపూర్ వినాయకుడు లడ్డూకు వేలం పాట నిర్వహించారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో రూ.35.00లక్షలు పలికింది బాలాపూర్ లడ్డూ ప్రసాదం. కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ గౌడ్ ఈ లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు. గతేడాది బాలాపూర్ లడ్డూను రూ.30.01 లక్షలకు బాలాపూర్‌కు చెందిన బీజేపీ రాష్ట్ర నాయకుడు కొలన్ శంకర్ రెడ్డి దక్కించుకున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది రూ.4.99లక్షలకు అధిక ధర పలికింది.వేలం తర్వాత హుస్సేన్‌సాగర్ వైపు బాలాపూర్ గణేషుడి శోభాయాత్ర 16కిలోమీటర్ల మేర సాగుతుంది. ఖైరతాబాద్ మహా గణపతి తెలుగు ప్రజలకు అస్సిసులు అందజేసి నేటి మధ్యాహ్నం నిమజ్జనం కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *