సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాలకొల్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ నిశ్చయ తాంబూలం వేడుక నేడు ఆదివారం, ఎస్ కన్వెన్షన్ హాలులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా పలువురు ప్రజా ప్రతినిధులు రాష్ట్ర స్థాయి నేతలతో పాటు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర విద్య శాఖ మంత్రి నారా లోకేష్ హాజరు అయ్యి నిశ్చయ వదువరులను ఆసిర్వదించారు. నిమ్మల రామానాయుడు వచ్చిన అందరు అతిధులకు వేదికపై శాలువాలు కప్పి సత్కరించి తన గౌరవం చాటుకొన్నారు
