సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ జులై 23 రాత్రి 9-30 ఫ్రీమియర్ షో నుండిథియేటర్స్ లో విడుదలైంది. తొలి రోజు ( 24 వ తేదీవరకు) బలమైన ఓపెనింగ్స్ తో పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్లలో ఒకటిగా నిలిచింది. కానీ, రెండవ రోజు ఈ సినిమా వసూళ్లులో భారీ పతనం కనిపించింది. Sacnilk నివేదిక ప్రకారం.. మొదటి రోజు రూ. 34.75 కోట్లు వసూలు చేయగా (ప్రీమియర్స్ ద్వారానే సినిమా రూ. 11 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ. 7 కోట్లు, ఓవర్సిస్ లో రూ. 4 కోట్లు రాబట్టినట్లుగా సమాచారం.) రెండవ రోజు రూ. 7.77 కోట్లకు కలెక్షన్లు పడిపోయాయి. ఇక పాన్ ఇండియా స్థాయిలో హిందీలో తమిళం, మలయాళ వెర్షన్ లు కేవలం లక్షలలో వసూళ్లు సాధించడం దిగ్బ్రాంతి పరిచింది. కర్ణాటక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వీరమల్లు గత 4 రోజులలో 3న్నర కోట్ల కలెక్షన్ 2న్నర కోట్ల పైగా షేర్ సాధించడం ఊరట నిచ్చే అంశం. భీమవరంలో అయితే మొదటి రోజు 9 థియేటర్స్ లో 2 మరియు 3వ రోజు 2 థియేటర్స్ లో నేడు, ఆదివారం 5 థియేటర్స్ లో వీరమల్లు ప్రదర్శిస్తున్నారు. మొదటి రోజు 50 లక్షలు పైగా వసూళ్లు సాధించగ నేటి ఆదివారం తో కలపి మొత్తం 4 రోజులలో భీమవరంలో టోటల్ సుమారుగా 75 లక్షలు కలెక్షన్ సాధించే అవకాశం కనపడుతుంది. ఏలూరులో కూడా దాదాపు ఇదే స్థాయి కలెక్షన్ వీరమల్లు రాబడుతున్నాడు
