సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ వైసీపీ పార్టీ అడ్జక్షురాలు వై యస్ షర్మిల ఆరోగ్య పరిస్థితి నేడు, శనివారం సాయంత్రానికి క్షిణిస్తున్నట్లు ఆమెకు తాజాగా టెస్టులు చేసిన వైద్యులు ద్రువీకరిస్తున్నారు. షర్మిల నిరాహారదీక్ష కొనసాగితున్నారు. ఇలాగె దీక్ష కొనసాగిస్తే బ్లాక్ హెడ్స్ పెరిగి ఆమె కిడ్నీ లకు ప్రమాదం వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. వివరాలలోకి వెళ్ళితే 3000 కిమీ పైగా నడిచిన షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రకు నర్సంపేటలో బ్రేక్ పడింది. అయితే దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించగా.. పాదయాత్రకు అనుమతినిచ్చింది. పోలీసులు మాత్రం పాదయాత్రకు అనుమతి నిరాకరించడంతో ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి తదుపరి అక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కానీ ట్రాఫిక్, శాంతి భద్రతల దృష్యా ఆమె దీక్షను భగ్నం చేసి లోటస్‌పాండ్‌కు తరలించారు. అక్కడ కూడా ఆమె ఆమరణ దీక్ష కొనసాగించారు. పాదయాత్రకు అనుమతి ఇచ్చేవరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు.
