సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిరుద్యోగులకు తాజగా ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. నేడు, శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటారన్నారు. ఉపాధ్యాయులు, జూనియర్ లెక్చరర్స్ బదిలీలపై సానుకూల దృక్పధం తో ఉంటామని .. త్వరలో బదిలీలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాలలో ఉన్న చట్టాలను కూడా పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసే అంశంపై పరిశీలిస్తున్నామన్నారు. సీఎం జగన్ దీని పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు. ఒక వర్గం మీడియాలో విద్యార్థులుకు రాగి జావా నిలిపివేశామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అది తాత్కాలికంగా మాత్రమేనని,, విద్యార్థులకు పరీక్షలు, ఒంటి పూట బడుల వలన ప్రస్తుతానికి రాగిజావాకు బదులు చిక్కీలు ఇస్తున్నామని మంత్ర బొత్స సత్యనారాయణ ప్రకటించారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *