సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులకు వైఎస్ జగన్ సర్కారు నేడు, గురువారం శుభవార్త ప్రకటించింది. గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 1000 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో 92 గ్రూప్‌-1 పోస్టులతోపాటు వేరే విభాగంలో ఏపీపీఎస్సీ 16 పోస్టుల భర్తీకి రెండు వేర్వేరు నోటిఫికేషన్లు జారీచేసిన విషయం తెలిసిందే. ఇందులో ఎనిమిది ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టులున్నట్లు తెలిపింది. అలాగే సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ కింద కంప్యూటర్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌(గ్రేడ్‌-2) పోస్టులు ఎనిమిది భర్తీ చేసేందుకు మరో నోటిఫికేషన్‌ ఇవ్వడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *