సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గా 4ఏళ్ళు పదవి కాలం పూర్తీ చేసిన నేపథ్యంలో..వైఎస్‌ జగన్‌, దంపతులు ఈ రోజు మంగళవారం అనాధ ఆశ్రయం ఇస్తున్న విజయవాడలోని . రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను సందర్శించారు జగన్‌ దం పతులు లకు స్థానిక ఎమ్మెల్యే లు మల్లాది విష్ణు, మాజీ మంత్రి వెలం పల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ఢిల్లీరావు నగర మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు స్వాగతం పలికారు. దాదాపు 30 నిముషాల పాటు అనాథ పిల్లలతో సీఎం దంపతులు ముచ్చటించారు.. ఆ తర్వాత నిర్మల్ హృదయ్ భవన్ లో నూతనంగా నిర్మించిన భవనాన్ని చిన్నారులతో కలిసి సీఎం జగన్‌ ప్రారంభించారు మదర్ థెరిస్సా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు సీఎం జగన్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *