సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మిజోరాం లో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల నిర్మాణంలో ఉన్న ఒక రైల్వే వంతెన కుప్ప కూలడంతో ఆ నిర్మాణానికి పనిచేస్తున్న 17 మంది అక్కడికక్కడే మరణించారు. .మిజోరం రాజధాని ఐజ్వాల్ కు 17 కిలోమీటర్ల దూరంలోని సైరంగ్ ప్రాంతం లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలం లో సుమారు 35-40 మంది కార్మికులు పనిచేస్తున్నారని బ్రిడ్జి ఒక్క సారిగా కుప్ప కూలడం తో 17 మంది మృతి చెందారని కొంత మంది గాయపడగా మరి కొంతమంది గల్లంతయ్యారని పోలీసులు తెలిపారు.మృతుల సంఖ్యా పెరిగే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం అందవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *