సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ సర్వర్ డౌన్ అయింది. సాంకేతిక సమస్య కారణంగా దేశవ్యాప్తంగా నేటి రాత్రి నుండి ఫేస్బుక్ సేవలు నిలిచిపోయాయి. ఫేస్బుక్ యూజర్లు వారి అకౌంట్ లాగిన్ అవుతుంటే ఎర్రర్ వస్తుంది. దీంతో ఏం జరిగిందో అర్థంకాక యూజర్లు అయోమయంలో పడ్డారు.. ఇన్స్టాగ్రామ్ థ్రెడ్స్, మెసెంజర్ సర్వీసులకు కాసేపు అంతరాయం ఏర్పడింది. మెటా సంస్థకు చెందిన ఈ సర్వీసులు సాంకేతిక సమస్య కారణం గా భారత్ సహా పలు దేశాల్లో స్తంభించడం తో నెటిజన్లు తమ ఖాతాలను అప్ డేట్ చేయలేకపోయారు. ఈ విషయాన్ని ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్‌డిటెక్టర్ (Downdetector) తెలిపింది. త్వరగా సర్వీసులు పునరుద్ధరిం చాలం టూ ఇతర సోషల్ మీడియాల్లో పోస్టులు పెట్టారు. అయితే, వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్య తమ దృష్టికి వచ్చిందని.. దీనిపై పనిచేస్తున్నట్లు మెటా తెలియజేస్తూ…వరుసగా సర్వీసులను నేటి రాత్రికి పునరుద్ధరించింది.
