సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం, మైలపల్లెరాచపల్లెలో విషాదం చోటుచేసుకొంది. నేడు, శనివారం స్థానిక నీటికుంటలోకి ఈతకువెళ్లి 7 సంవత్సరాల వయస్సుగల ముగ్గురు బాలురు మృతి చెందారు.చిన్నారులు రాజుదేవా,రాజు జయ,యశ్వంత్‌లు నీటికుంటలో మునిగి చనిపోయారు. ఉదయం నుండి పిల్లలు కనిపించక వారి తల్లితండ్రులు తీవ్ర ఆందోళలంతో చుట్టుప్రక్కల వెతకగా నీటికుంటలో వున్నట్లు స్ధానికులు గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *