సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నీట్ యూజీలో ర్యాంకు కొట్టడం ఎందరికో లక్ష్యం. అయితే ఈ అబ్బాయి మాత్రం ఎంతో అవలీలగా ఏకంగా టాప్ ర్యాంకు సాధించాడు. కానీ ఎంబీబీఎస్ చదవడం ఇష్టం లేదని మొండిపట్టుదలతో ఉన్న తల్లిదండ్రులను ఒప్పించలేకపోయాడు. అంతే నీట్ యూపీ అడ్మిషన్ రోజే నిందు ప్రాణాలు తీసుకున్నా ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో జరిగింది. సిందేవాహి తాలూకాలోని నవర్‌గావ్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల విద్యార్థి అనురాగ్ ఈ ఏడాది నిర్వహించిన నీట్ యూజీ-2025లో ఏకంగా 99.99 శాతం మార్కులు సాధించాడు. జాతీయ స్థాయిలో OBC కేటగిరీలో 1475 ర్యాంకును దక్కించుకున్నాడు. కౌన్సెలింగ్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లోని కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సులో సీటు కూడా పొందాడు. అడ్మిషన్ తీసుకోవడానికి బయల్దేరేందుకు అంతా సిద్ధం అవుతుండగా మంగళవారం (సెప్టెంబర్ 23) తెల్లవారుజామున ఇంట్లోని తన గదిలో అనురాగ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు అనురాగ్ గదిలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కొడుకు ఎంబీబీఎస్‌లో చేరి, తమ కలలు నెరవేరుస్తాడని ఆశపడిన తల్లి తండ్రులకు కొడుకు మృతి తో జీవిత కాల మనోవేదన మిగిలింది.
