సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో శ్రీ మావుళ్ళమ్మవారితో పాటు అదే దేవాలయ సమీపంలో దశాబ్దాలుగా సుదీర్ఘ కాలంగా నడుస్తున్న నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం కు ఒక ప్రతిష్ట ఉంది. వీరి అనుబంధ సంస్థ శ్రీ మావుళ్ళమ్మ వారి ఉత్సవ కమిటీ కి చాల ప్రాధాన్యత ఉంది. వారి వర్తక భవన సంఘ భవనంలో జరిగిన సమావేశంలో నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం నూతన అడ్జక్షుడుగా తుటారపు ఏడుకొండలు మరియు శ్రీ మావుళ్ళమ్మవారి ఉత్సవ కమిటీ అడ్జక్షునిగా రామాయణం గోవిందరావు ను ఎన్నుకొన్నారు. వీరితో పాటు మిగతా కార్యవర్గ సభ్యులకు భీమవరంలో పండ్లు, కూరగాయల వ్యాపారులతో పాటు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
