సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నందమూరి బాలకృష్ణ , పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ల అన్ స్టాపబుల్ 2 ప్రభాస్ ఎపిసోడ్ మొదటి భాగం దేశవ్యాప్తంగా గతంలో ఏ ఓటిటి లో లేని విధంగా.. ఆహా .. అల్ టైం రికార్డు రేటింగ్ సాధించింది. బాలకృష్ణ జోష్ కు సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతూ కూడా ఎక్కడ దొరకకుండా దీటైన సమాధానాలుతో తప్పించుకున్న ప్రభాస్ శైలి ప్రేక్షకులను రక్తి కట్టించింది. ఒక దశలో ప్రతి ప్రశ్నకు లౌక్యం గా తప్పించుకొంటున్న ప్రభాస్ నుద్దేశించి బాలకృష్ణ ‘ఏంటి నా దగ్గర నీ భీమవరం తెలివి తేటలు ప్రదర్శిస్తున్నావు అనెయ్యడం కూడా జరిగింది. ఇక ప్రభాస్ ఈ కార్యక్రమానికి వస్తున్నాడని తెలిసినప్పటి నుంచి ఫ్యా న్స్ ప్రోమోలు, కోసం ఎం తగానో ఎదురుచూశారు. అం దుకే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ పెద్ద హిట్ అయ్యింది. ఇక ప్రభాస్ ఎపిసోడ్కు సంబంధించిన రెండో భాగం ప్రోమోను తాజాగా ఆహా విడుదల చేసింది. బాలకృష్ణ హుషారైన పంచులతో ప్రభాస్ సరదా సమాధానాలతో ఆకట్టుకుంటోంది. ఈ రెండోభాగంలో ప్రభాస్ తో పాటు గోపిచంద్ కూడా పాల్గొన్నా డు. తమన్నా , నయనతారలలో ఎవరినీ షాపింగ్ తీసుకెళ్తావు అని ప్రభాస్ ని అడగ్గా.. ‘ఇద్దర్నీ తీసుకెళ్తాను..’ అని గడుసుగా సమాధానం చెప్పాడు. ఈ
ఎపిసోడ్ జనవరి 6న డిజిటల్ ప్రేక్షకులను అలరించనుంది.
