సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరు జిల్లాలో వివిధ వ్యాధులతో రోగులు ఆసుపత్రుల్లోచేరి దురదృ ష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన సందర్భాల్లో పార్దీవ దేహాలను వారి ఇళ్లకు ఉచితంగా తరలించడానికి ఎంపీ నిధులతో సమకూర్చిన మూడు మహాప్రస్థాన వాహనాలను ఏలూరు పార్లమెం టు సభ్యులు కోటగిరి శ్రీధర్,జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. రూ.24.60 లక్షల ఎం పీ నిధులతో సమకూర్చి న ఈ వాహనాలను ప్రారం భిం చిన అనం తరం ఎం పీ కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ.. .. ఈ వాహనాలు జిల్లాలోని నూజివీడు, జంగారెడ్డిగూడెం ,చింతలపూడి ఏరియా ఆసుపత్రుల్లోఅందుబాటులో ఉంచి ఉచితసేవలు అందిస్తామన్నారు. ఈ సేవలు నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉం టాయన్నారు.
