సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరు జిల్లా నూజివీడు లో ఆర్జేయూకేటీ పరిధిలో గల ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్ల ప్రక్రియ రెండోరోజు ముగిసింది. మొత్తం నూజివీడు, అరకు వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు గాను తొలివిడతగా నూజివీడు, అరకు వ్యాలీలో అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో గత విద్యా సంవత్సరానికి భిన్నంగా ఆయా కేంపస్‌లలోనే అడ్మిషన్ల ప్రక్రియ ను చేపట్టగా, నూజివీడు ట్రిపుల్ ఐటీ కేంపస్‌లో రెండోరోజు శుక్రవారం అడ్మిషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి మొత్తం 951 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో మొత్తం 1085 సీట్లకు గాను రెండు రోజుల్లో 1090 మంది విద్యార్థులకు కాల్ లెటర్లు పంపగా 951 మంది విద్యార్థులు కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరై అడ్మిషన్లు పొందారు, కాగా రెండో రోజు 540 మంది విద్యార్థులకు కాల్‌లెటర్లు పంపగా, 470 మంది హాజరై అడ్మిషన్లు పొందినట్లు ట్రిపుల్ ఐటీ అధికారులు తెలిపారు.
