సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గ పరిధిలో నూతనంగా నియమించబడ్డ అంగన్వాడి టీచర్లు, ఆయాలకు గత గురువారం రాత్రి స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారు అని , భీమవరం లో అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న బలమైన పౌష్టిక ఆహారాన్ని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సక్రమంగా అందించాలని, మానవతా దృక్పధంతో , చిత్తశుద్ధితో వారి విధులు సక్రమంగా నిర్వర్తించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరారు. ఇప్పటికే నియోజకవర్గంలో చిన్నారులకు, గర్భిణీలకు, బాలింతలకు బలమైన పౌష్టిక ఆహారాన్ని అందించే విధంగా మెనూ ఏర్పాటు చేసి అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ విజయరత్నం పాల్గొన్నారు.
