సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నేడు, శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మినిస్ట్రియల్ మునిసిపల్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు వారి అడ్జక్షులు ఎస్. కృష్ణమోహన్ ఆధ్వర్యంలో 3వ సారి పదవి అలంకరించిన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ను కలసి సాళువ కప్పి పుష్పగుచ్చాలతో సత్కరించారు. ప్రభుత్వ పరంగా మునిసిపల్ శాఖ ఉద్యోగులు కు అన్ని సహకారాలు అందించడానికి సమస్యలు పరిష్కరించడానికి తన వంతు సహకరిస్తానని ఎమ్మెల్యే అంజిబాబు హామీ ఇచ్చారు. ఈ సందర్భముగా మునిసిపల్ ఉద్యొగుల ప్రతినిదులు రాష్ట్రంలో భారీ మెజారిటీ తో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్ కు నూతన సీఎం కాబోతున్న చంద్రబాబు కు జనసేన పవన్ కళ్యాణ్ కు తమ శుభాబినందలు తెలియజేస్తూ .. నూతన ప్రభుత్వ నిర్ణయాలను అర్బన్ ప్రాంతాలలో అమలు పరుస్తూ ప్రభుత్వ ప్రతిష్ట పెంచేలా పని చేస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *