సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చినతిరుమల గా తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన, ద్వారక తిరుమల వేంకటేశ్వరస్వామి వారి గర్భాలయం వాకిలి తాజగా బంగారు కాంతులతో. ధగధగలాడుతుంది. ఇక ధనుర్మాస నేపథ్యంలో బంగారు వాకిలి నుంచి చిన వెంకన్న దివ్య మంగళస్వరూపాన్ని వీక్షిస్తున్న భక్తులు తన్వయత్వం పొందుతున్నారు. స్వయం భువుడు చిన వెంకన్న వారికి బంగారు వాకిలి ఏర్పాటు చేసేందుకు పలువురు దాతలు ముందు కొచ్చారు. 2021లో జిల్లా రైస్‌మిల్లర్ల అసోసియేషన్ సుమారు 265 గ్రాముల బంగారం, 148 కేజీల రాగి రేకులతో ఆలయ ప్రధాన ముఖద్వారానికి, తలుపులు, అంతరాలయ ద్వారానికి బంగారు తాపడం చేయించారు. తరువాత గర్భాలయం స్వర్ణశోభితం చేయడానికి కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరుకు చెందిన దీపక్ నెక్స్‌జెన్ ఫీడ్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఎండి అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం, డైరెక్టర్లు కలసి రూ.1.64 కోట్లు ఖర్చు చేశారు. తిరుమల తరహాలో కొత్త ఏడాది శ్రీవారి ఆలయ విమాన గోపురం కూడా బంగారు తాపడం చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
