సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబు ఆద్వర్యంలోని కూటమి సర్కార్ కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ధర్మకర్తల మండలి నియామకం కు దాదాపు పచ్చ జెండా ఊపిన ఇంకా జీవో జారీపై ప్రతిష్టంభన నెలకొంది. కొత్తగా ఏర్పటయ్యే పాలకవర్గం నియామకంలో ఇద్దరు సభ్యులపై పలు ఆరోపణల నేపథ్యంలో సర్కార్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మొత్తం 24 మందితో టీటీడీ బోర్డు నూతన సభ్యులతో ఏర్పాటు అవుతుంది. వీరికి అయితే సీఎం చంద్రబాబుకు అత్మియుదు టివి 5 చేనెల్ అధినేత బొల్లినేని రాజగోపాల నాయుడును బోర్డు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అలాగే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారికి బోర్డులో స్థానం కల్పించారు. టీటీడీ బోర్డులో ఏపీ తర్వాత తెలంగాణకే అధికార ప్రాధాన్యం ఇచ్చారు. ఏపీలోని ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజును నియమించారు. తెలంగాణకు చెందిన టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డిని టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించారు.
