సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో ‘పుష్ప2‘ ఇండియన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వద్ద నెంబర్ వన్ సినిమాగా రికార్డు నమోదు చేసింది. రికార్డు వసూళ్లతో ఇండియన్ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. ఇప్పటికే 7ఏళ్ళ క్రితమే ప్రపంచవ్యాప్తంగా రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లతో పాన్ ఇండియా సూపర్ స్టార్ ‘ప్రభాస్’ బాహుబలి మరియు చైనా లో 1250 కోట్ల కలెక్షన్ తో కలపి 1850 కోట్ల కలెక్షన్ వసూళ్లు చేసిన అమిర్ ఖాన్.. దంగల్ రికార్డులను బద్దలుకొట్టింది. తెలుగు హీరో అల్లు అర్జున్ బ్రాండ్ ప్రపంచ వ్యాప్తంగా మారు మ్రోగుతూనే ఉంది. ఇటీవల ఐటి దాడుల నేపథ్యంలో కొంత ఆందోలన చెంది కలెక్షన్ రిపోర్ట్ నిలిపివేసిన నిర్మాతలు తాజగా ‘పుష్ప 2’ ఇప్పటివరకూ సాధించిన ఫైనల్ కలెక్షన్స్ ని నేడు, మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ. 1,871 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్.. రికార్డ్స్ రప్పా రప్పా అంటూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోనూ రికార్డు స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటోంది.. మన శత్రు దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో సైతం అల్లు అర్జున్ ప్రభంజనం మాములుగా లేదట.అల్లు అర్జున్ సాధించిన ఈ ఘనత తెలుగువారందరూ గర్వించవలసిందే..
