సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు, మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇకపై చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టామని, గతంలో ఆ రేషన్ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక రోజువారీ పనులు మానుకొని, చిరుద్యోగాలకి సెలవు పెట్టుకోవాల్సి వచ్చేదని విమర్శించారు. అవే వాహనాలలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం, సరుకులను అక్రమంగా తరలిస్తున్న విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణలో బయటపడిందని, వేలాది టన్నుల అక్రమ బియ్యాన్ని తమ ప్రభుత్వం కాకినాడ, విశాఖపట్నం పోర్టుల్లో పట్టుకుందనిఅన్నారు. .ఇకపై ప్రతీ పేద కుటుంబానికి రేషన్ సరుకులు అందించేందుకు ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు.. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు అలాగే సాయంత్రం 4గంటల నుంచి 8 గంటల వరకు రేషన్ డీలర్ల దుకాణాల వద్ద అందజేస్తామని తెలిపారు.అలాగే దివ్యాంగులకు, 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందించే సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించిందని తెలిపారు.
