సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆక్వా రాజధానిగా ప్రసిద్ధి పొందిన భీమవరం జోన్ లో రొయ్యల రైతులు మరల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కరోనా సంక్షోభము తరువాత విదేశాల కు ఎగుమతులు ముఖ్యంగా అమెరికా తో పాటు చైనాకు కు భారీ స్థాయిలో ఎగుమతులు పెరగడంతో రొయ్య ధర అమాంతంగా పెరిగి రైతులకు లాభాలు పెంచింది. అయితే అకస్మాత్తుగా ఇటీవల రొయ్యల ధర మళ్లీ పడిపోతూ వస్తుంది. రొయ్యలు ధర పెరిగిందని మరింత మంది రైతులు చెరువులలో కొత్తగా సాగు మొదలెట్టగానే ధర పడిపోవడం రైతులులో భయం పెరిగింది. నెలరోజులుగా సుమారు ఒక వంద కౌంట్లోనే రూ.60 వరకు ధర తగ్గుముఖం పట్టడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. గత సెప్టెంబర్ఒకటో తేదీకి 100 కౌంట్ రొయ్య రూ.300 పలుకగా 15 తేదీ నాటికి రూ.280, ఉండగా తాజగా నేటి శనివారం ఉదయానికి రూ.230లకు పడిపోయింది. మరో రెండు రోజుల్లో ఇంకా ధర తగ్గిపోతుందని వస్తున్నా సంకేతాలుతో రైతులకు దిక్కు తోచడం లేదు. ధర బాగున్నపుడు భారీ వర్షాలు వల్ల ఆక్సిజన్ కొరతతో చాల రొయ్యలు చనిపోయి సమస్యలు వచ్చి దిగుబడి తక్కువగా వచ్చింది. రేటు బాగుందని గత రెండు నెలల్లో కొత్తగా 15వేల ఎకరాలకుపైగా సాగులోకి వస్తే ఇప్పుడు రేటు పడిపోతుంది. ఇటీవల మేతల ధరలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన నేపథ్యంలో వాటి ధరలను కొద్దిగా తగ్గించడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఇంతలోనే రొయ్యల కౌంట్ ధర పడిపోయింది. భీమవరం ప్రాంత లోకల్ రిటైల్ మార్కెట్ లో రొయ్యలు అందుబాటు ధరలకి రావడంతో రొయ్యల ప్రియులు లొట్టలేసుకొంటూ కొనుకోళ్ళు చేస్తున్నారు.
